Tuesday, 28 July 2026 11:59:11 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మంత్రి కొండ సురేఖను కలిసిన మున్నూరు కాపు నేతలు

Date : 02 November 2024 09:36 PM

Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : ప్రతినిధులు శనివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వపరంగా వారికి అందించాల్సిన సహాయ, సహకారాల గురించి మంత్రి సురేఖకు వారు వివరించారు. బిసిల ఉన్నతికి, కాపు సమాజ పురోగతికి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా మంత్రి సురేఖ అందిస్తున్న చేయూతను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంలో మంత్రి సురేఖ చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాపుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట ప్రగతిలో ముఖ్య భూమికను పోషిస్తున్న కాపులు, మున్నూరు కాపులకు చాలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తపిస్తున్నారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అతి త్వరలో మున్నూరు కాపు కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించి, కాపు సమాజం సంక్షేమం, అభివృద్ధి పై పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: