Wednesday, 15 April 2026 03:46:04 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

టీచర్స్ ప్రమోషన్స్ లిస్ట్ రెడీ...

Date : 18 June 2024 07:53 PM

Telugu Rekha Media - ఎడ్యుకేషన్ / హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా మల్టీజోన్‌ వన్‌ పరిధిలో ప్రమోషన్లు క్లియర్ చేయనున్నారు. వరంగల్ పరిధిలోని దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులకు ముందు గుడ్ న్యూస్ రానుంది. తర్వాత హైదరాబాద్ పరిధిలోని ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పనుంది ప్రభుత్వం. మల్టీజోన్‌ వన్‌ పరిధిలో 19 జిల్లాలు ఉన్నాయి. అక్కడ పదివేల మందికిపై ఉపాధ్యాయులు పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జీవో వస్తే దాదాపు 4900 మంది లాంగ్వేజ్ పండిట్లు, 900 మంది పీఈటీలకు ప్రమోషన్ లభించనుంది. ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ పండిట్లు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లుగా, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లుగా, ఎస్జీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందుతారు. ఈ ప్రమోషన్ లిస్టులో ఎక్కువ మంది లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలే ఉన్నారు. మల్టీ జోన్‌ వన్ పరిధిలో దాదాపు ఐదు వేల మంది లాంగ్వేజ్ పండిట్లు, వెయ్యి మంది పీఈటీలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా, ఖమ్మంలో జిల్లాలో ఉన్నారు. ప్రమోషన్ లభించిన ఉపాధ్యాయుడికి రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మొదటి జోన్ ప్రమోషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రెండో మల్టీ జోన్ పరిధి ప్రమోషన్ ఉత్తర్వులు రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెండో మల్టీజోన్‌లో 14 జిల్లాల ఉపాధ్యాయులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :