Saturday, 13 June 2026 07:06:08 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

శివాని పబ్లిక్ స్కూల్లో మోగిన విద్యార్థి ఎన్నికల నగరా...

శివాని పాఠశాల ఎలక్షన్ కమిషనర్ గా విద్యాసంస్థల చైర్మన్ వేములపల్లి సుబ్బారావు.

Date : 21 July 2024 12:16 AM

Telugu Rekha Media - ఎడ్యుకేషన్ / వరంగల్ : నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే, నవసమాజ నిర్మాణంలో విద్యార్థులదే కీలకపాత్ర. రాజకీయాల్లోకి విద్యార్థులే నాయకులుగా రావాలి. అప్పుడు గాని దేశం బాగుపడదంటూ.. అప్పుడప్పుడు మనకు వినిపించే మాటలు నేటి యువతరాన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది, అందుకు పాఠశాలలు కేంద్ర బిందువులవుతున్నాయి. పాఠశాల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా వారిని తీర్చిదిద్దుతూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీంతో మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకులుగా ఎదగాలనే సంకల్పంతో విద్యార్థులు ముందడుగు వేస్తున్నారు. విద్యార్థి ఎన్నికలు విద్యార్థి జీవితంలో ప్రజాస్వామ్యం యొక్క శక్తిని పరిచయం చేయటంలో ముఖ్యమైన భాగంగా నిలుస్తాయి. విద్యార్థి దశ నుండే ఎన్నికలు నిర్వహిస్తూ, ప్రోత్సహిస్తూ, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ, సరైన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలో అవగాహన కల్పిస్తూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించిన పాఠశాల.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం లోని శివాని పబ్లిక్ స్కూల్ (గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్) యందు శుక్రవారం ఎన్నికల నగరా మోగింది. ప్రైమరీ స్కూల్ సెక్షన్ లో 4 పోస్టులకు 4 మంది విద్యార్థి ప్రతినిధులను హై స్కూల్ సెక్షన్ లో 4 పోస్టులకు 16 మంది విద్యార్థి నాయకులుగా నామినేషన్ పత్రాలను శివాని పబ్లిక్ స్కూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డైరెక్టర్ రాహుల్ కి సమర్పించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ పత్రాలు సరిగా లేని విద్యార్థి నాయకులను ఏడుగురి నామినేషన్లను తిరస్కరించారు. శనివారం రోజు ఉదయం 10:30 కు నలుగురు విద్యార్థి ప్రతినిధులను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చెందిన సుమారు 280 విద్యార్థి ఓటర్లు ఓటు వేశారు. హై స్కూల్ సెక్షన్ కు సంబంధించిన సుమారు 300 మంది విద్యార్థి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు ఎలక్షన్ బూత్ నందు పోల్ చీటీలు తీసుకొని బ్యాలెట్ పెట్టె లో విద్యార్థులు తమ ఓటు వేశారు. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియలో భాగం కావడం కొత్త అనుభూతిగా మారింది. ఓటింగ్ విధానంలో విద్యార్ధులు మొదటిసారి పాల్గొన్నందున ప్రతి విద్యార్థి ఓటర్ కు ఎడమ చూపుడువేలు పై శిరా అంటించడం నుండి వారి ఓటు వేసే విధానం వరకు మొత్తం ప్రక్రియ యొక్క సూచనలు ఇవ్వబడ్డాయి. విద్యార్థి ప్రతినిధులుగా నిలబడిన అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లలో తమకు కావలసిన గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. పాఠశాల యొక్క సెమినార్ హాల్ పోలింగ్ బూత్ గా మారింది, అక్కడ వేగంగా ఓటు వేయడానికి వీలుగా 16 ఓటింగ్ టేబుల్ లను ఇరువైపులా సమకూర్చారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై 02:00 గంటలకి పోలింగ్ ముగిసింది. పోలింగ్ సిబ్బంది గా పాఠశాలలో పనిచేస్తున్న సుమారు 42 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేశారు. పాఠశాలలో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో పాఠశాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఫ్లయింగ్ స్క్వాడ్ గా గీతాంజలి విద్యాసంస్థల అధినేత చైర్మన్ అయినటువంటి వేములపల్లి సుబ్బారావు, పాఠశాల డైరెక్టర్ గిరగాని రాహుల్ వర్మ, ప్రిన్సిపాల్ మలుగురు సురేందర్ లు తనిఖీ అధికారులుగా పోలింగ్ బూత్ ను సందర్శించారు. పోలింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం గెలుపొందిన అభ్యర్థులను గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు హై స్కూల్ సెక్షన్ పాఠశాల విద్యార్థి నాయకులుగా చరిష్మా, 54 సుష్మత్ 58 ఇద్దరు విద్యార్థి నాయకులు మెజారిటీతో గెలుపొందారు పాఠశాల సహాయ విద్యార్థి నాయకులుగా రితేష్-44, హాసిని-38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రైమరీ స్కూల్ పాఠశాల విద్యార్థి నాయకులుగా దీక్షిత్ రితికలు 25, పాఠశాల సహాయ విద్యార్థి నాయకులకు శ్రీమానాధిత్య బిన్య 28 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన విద్యార్థి నాయకులకు విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన విద్యాసంస్థల చైర్మన్, వేములపల్లి సుబ్బారావు, డైరెక్టర్లు గిరగాని రాహుల్ వర్మ, కిరణ్, స్వాతి, దేవేందర్, శివాని పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మలుగూరి సురేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచిన విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో గెలిపించిన మా తోటి విద్యార్థినీ విద్యార్థులకు విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఏ సమస్యలున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి సురేందర్ ద్వారా సమస్యలని మేనేజ్మెంట్ కి తీసుకువెళ్లే దిశగా మేము చదువుకుంటూ పాఠశాలకు సంబంధించిన విద్య, క్రీడా, గుణాత్మక అన్ని రంగాలలో ముందుండి పాఠశాల యజమాన్యానికి, విద్యార్థులకు వారధిలుగా పనిచేస్తూ మా కన్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మా తోటి విద్యార్థిని విద్యార్థులకు మంచి పేరు తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :