Saturday, 13 June 2026 06:37:32 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి..

--సీఎం రేవంత్ రెడ్డి.

Date : 16 August 2024 04:07 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : రుణమాఫీ చేయలేరని కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. రుణమాఫీ అమలు చేశాం..హరీశ్‌రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్‌ రావు చెప్పాలి అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.సాగుకు జీవం.. రైతుకు ఊతం పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.వరంగల్‌ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తా మని రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశాం.ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌ అడ్డా. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చా. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరా లకు సాగునీరు అందిందే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు పడక గదుల ఇళ్ల పేరిట కేసీఆర్‌ మోసం చేశారు.మేం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. రాష్ట్ర వ్యా ప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :