Wednesday, 15 April 2026 03:42:28 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వ‌చ్చే ఐదు మాసాల్లో రూ. 1372 కోట్ల నిధుల‌తో ప్ర‌ణాళిక‌లు

ఆమోద ముద్ర వేసిన మంత్రి సీత‌క్క‌

Date : 01 November 2024 09:02 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) రాష్ట్రంలో ప‌క‌డ్బందిగా అమ‌లు చేయాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌నులు చేయించాల‌ని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హ‌మీ నిధుల‌తో వ్య‌వ‌సాయ‌ అనుబంధ ప‌నుల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌న్నారు. శాశ్వ‌తంగా నిలిచేలా ఉపాధి హ‌మీ ప‌నులు చేప‌ట్టాలన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. రాష్ట్రంలో MGNREGS అమ‌లు పై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శుక్ర‌వారం నాడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో త‌న చాంబ‌ర్ లో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్, క‌మీష‌న‌ర్ అనితా రామ‌చంద్ర‌న్, స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ ష‌ఫిఉల్లా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ, పంచాయ‌తీ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ క‌న‌క‌ర‌త్నం, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో మంత్రి సీత‌క్క బేటి అయ్యారు. రాబోయే 5 నెలల కాలానికి సంబంధించి రూ. 1372 కోట్ల MGNREGS లో నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉపాధి భ‌రోసా, పంట‌పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద చేప‌ట్టే ప‌నుల‌ను ఫైన‌లైజ్ చేసారు. రూ. 106 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి కార్య‌క్ర‌మం కింద ప్రతి నియోజకవర్గానికి సుమారు కోటి నిధులను వెచ్చించాల‌ని నిర్ణయించారు. మొత్తం 5,400 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయాన్ని పెంచే దిశ‌లో పశువుల కొట్టాలు, కోళ్ళ షెడ్ల నిర్మాణాం, వర్మి కొంపోస్ట్-వాన పాముల ఎరువుల తయారీకి తోట్ల నిర్మాణం, SHG లో ఉన్న రైతుల బీడు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తీసుకొచ్చే ప్ర‌ణాళిల‌కు మంత్రి సీత‌క్క ఆమోదం తెలిపారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :