Saturday, 13 June 2026 06:55:00 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన...

Date : 18 June 2024 07:28 PM

Telugu Rekha Media - సినిమా / ఆదిలాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు శంకుస్థాపన చేశారు. ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఎటిసి) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటిఐల‌ను ఎటిసిలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటిఐల‌ను ఎటిసిలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టిటిఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవొయు) కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐటిఐలను ప్రక్షాళన చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమన్నారు. అందులో భాగంగానే వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా(ఏటిసీలుగా) అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి సమయాన్ని వృథా కానివ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ‘‘ నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు రూ. 15 వేలు లేక రూ. 20 వేలకే పనిచేస్తామన్నారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని అడిగితే రూ. 60 వేలు అడిగారు’’ అని వివరించారు. సర్టిఫికేట్లు జీవన స్థాయిని పెంచడం లేదని అప్పుడే అర్థమయిందన్నారు. చాలా మంది అందుకే గల్ఫ్ కు వెళుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల 65 ఐటిఐలను ఆధునీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటిఐలను అడ్వాన్స్ డ్ అప్ గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 307.96 కోట్లు కాగా, టిటిఎల్ వాటా రూ. 2016.25 కోట్లని వివరించారు. ఏటిసీల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. * 65 ఐటీఐల‌ను ఎటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. * ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎటిసిల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు. * శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టిటిఎల్ నియ‌మిస్తుంది. * ఎటిసిల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు. * గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటిఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఎటిసిల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందుతారు. * ఐటీఐల‌ను ఎటిసిలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టిటిఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74) * ఎటిసిలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. అలాగే ఈ ఎటిసిలు ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి. * ఎటిసిల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. * ఎటిసిలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయి.

* 65 ఐటీఐల‌ను ఎటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. * ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎటిసిల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు. * శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టిటిఎల్ నియ‌మిస్తుంది. * ఎటిసిల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు. * గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటిఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఎటిసిల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందుతారు. * ఐటీఐల‌ను ఎటిసిలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టిటిఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74) * ఎటిసిలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. అలాగే ఈ ఎటిసిలు ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి. * ఎటిసిల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. * ఎటిసిలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయి.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :