Wednesday, 15 April 2026 03:06:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

'ఓదెల 2' కీలకమైన యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం...

Date : 28 June 2024 09:54 PM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీ లింగ్వల్ ఫిల్మ్ 'ఓదెల 2' కీలకమైన యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ 'ఒదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ అయిన 'ఒదెల-2 కోసం' కోసం చేతులు కలిపారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది. హై-బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించింది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి. ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయగల ఎబిలిటీ వున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, 'ఓదెల 2' ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :