Wednesday, 15 April 2026 02:58:03 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ 'రారాజా' టీజర్

Date : 15 June 2024 08:42 PM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'రా రాజా'. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. తాజాగా హీరో అల్లరి నరేష్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. నిమిషంనర నిడివి గల టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్యారెక్టర్ ని చూపించకుండా, ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసిన ఈ ట్రైలర్ హర్రర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ అనిపించింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడి కాన్సెప్ట్, టేకింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మొత్తానికి టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ దర్శకత్వం వహించిన రారాజా సినిమా టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది .డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నేను చాల ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే దీనిలో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కనిపించకపోవడం. అదే విషయం డైరెక్టర్ ని అడిగితే చూస్తున్నంత సేపు ఏ ఆడియన్ కూడా ఎంగేజ్ మిస్ అవ్వడు, వింటున్నంత సేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని చెప్పారు. A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు.. ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని .. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :