Wednesday, 15 April 2026 03:42:29 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఇండియన్ సినిమాకి చెందిన ఇద్దరు లెజెండ్స్...

-- అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ను39 సంవత్సరాల తర్వాత ఒకచోట చేర్చిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'

Date : 27 June 2024 08:56 AM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : కల్కి 2898 AD మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత రీయూనియన్ కావడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ గెరాఫ్తార్‌లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. సెప్టెంబరు 13, 1985న విడుదలైన ఈ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.కల్కి 2898 ADలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది.సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్ గా వుంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్ లో అద్భుతంగా అలరించబోతున్నారు కమల్ హసన్. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ గా కనిపించనున్నారు. ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రెండు పాత్రల గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి, చాలా ఆసక్తిని రేకెత్తించాయి, సినిమా కోసం అంచనాలను పెంచాయి.రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎక్సయిట్మెంట్ పెరుగుతూనే ఉంది. కల్కి వినూత్న కథాంశం, స్టార్-స్టడెడ్ లైనప్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆన్-స్క్రీన్ రీయునియన్ చూసే అవకాశం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ఇండియన్ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఇది లెజెండరీ ట్యాలెంట్, భారతీయ పురాణాలను డిస్టోపియన్ ఫ్యూచర్‌తో బ్లెండ్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ స్టొరీ టెల్లింగ్ ని అందిస్తోంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి 2898 AD. ఈ మాగ్నమ్ ఓపస్ లోబిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీ రోల్స్ పోషిస్తున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :