Saturday, 13 June 2026 06:46:33 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

'హరోం హర'కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ..

-- మంచి సినిమా తీశామని అందరూ అభినందించడం ఆనందంగా వుంది: ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం,

Date : 15 June 2024 08:39 PM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : సుమంత్నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన హరోం హర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్ జి నాయుడు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర తో సూపర్ హిట్ కొట్టారు. ముందుగా మీకు కంగ్రాట్స్.. -అందరికీ థాంక్ యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. మంచి సినిమా చేశామని అందరూ అభినందిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి దర్శకులు మారుతి గారు, సంపత్ నంది ఫోన్ చేసి మంచి సినిమా తీశారని చెప్పారు. ఖచ్చితంగా ఓ మంచి సినిమా తీస్తామని ముందు నుంచి చెబుతున్నాం. ఇప్పుడు అదే జరిగింది. కలెక్షన్స్ చాలా బావున్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. -దర్శకుడు సాగర్ మీద పూర్తి నమ్మకం పెట్టాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. సుమంత్ గారు.. హరోం హరోతో మీ జర్నీ గురించి చెప్పండి ? డాడీ బిజినెస్ కారణంగా రాజమండ్రిలో వుండేవారు. ఈ సినిమా షూటింగ్ లో వందశాతం నా ఇన్వాల్మెంట్ వుండేది. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. సుమంత్ గారు.. మీకు ఇష్టమైన హీరోలు ? నాకు ప్రభాస్, రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం. స్టెప్ బై స్టెప్ వెళ్లి వాళ్ళతో సినిమా చేయాలని వుంది. సుబ్రహ్మణ్యం గారు.. సుధీర్ బాబు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? సుధీర్ బాబు గారితో కలసి పనిచేయడం చాలా బావుంది. చాలా మంచి ఎక్స్ పీరియన్స్. సుధీర్ బాబు గారి సమ్మోహనం సినిమాని ముందు మీరే ప్రోడ్యుస్ చేయాలనుకున్నారని విన్నాం.? -అవునండీ.. సమ్మోహనం నేనే చేయాలి. ఇంద్రగంటి గారితో కూడా రెండు మూడు మీటింగులు కూడా అయ్యాయి. అయితే కొన్ని కారణాలు వలన అది చేయడం కుదరలేదు. అది చాలా మంచి సినిమా. ఫ్రీ టైం లో ఆ సినిమా చాలా సార్లు చూస్తుంటాను. హరోం హరలో హీరోయిన్ మాళవిక అద్భుతంగా చేశారు. కానీ ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కారణం ? -మాళవిక చాలా మంచి యాక్టర్. తన పెర్ఫర్మెన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తను లా చదువుతుంది. ఎగ్జామ్స్ వుండటం వలన ప్రమోషన్స్ కి రావడం కుదరలేదు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా ? -చైతన్ చాలా ఫ్రండ్లీ గా ఉంటారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి టాప్ అతనే. కెమరామ్యాన్ కూడా అద్భుతంగా చేశాడు. సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ? తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా నచ్చింది. నేను మా అబ్బాయి కూడా అలానే వుంటాం. ఎదున్నా షేర్ చేసుకుంటాం. అలాగే ఫైట్స్ కూడా టాప్ గా వున్నాయి. ఫైట్స్ కోసం సినిమాని దాదాపు పదమూడుసార్లు చూశాను. హరోం హర బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేస్తూ మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారని విన్నాం ? -రెండు మూడు ప్రాజెక్ట్స్ వున్నాయి. సినిమాల్లో వుండాలని, మా అబ్బాయిని ఇక్కడే వుంచాలని నా గట్టి నిర్ణయం. మాకు సినిమాలు అంటే చాలా పాషన్. మీ అందరి సపోర్ట్ తో ఇక్కడే కొనసాగాలని కోరుకుంటున్నాం.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :