Saturday, 13 June 2026 06:55:34 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్...

Date : 28 June 2024 09:59 PM

Telugu Rekha Media - సినిమా / హైదరాబాద్ : ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్‌'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కి చార్ట్-బస్టర్ ఆల్బమ్‌, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు. ఫస్ట్ సింగిల్ 'స్టెప్పా మార్' ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్ గా మాస్ ప్రేక్షకులకు ఇన్స్టంట్ ఎడిక్షన్ కానుంది. రామ్ డ్యాన్స్ మూవ్స్ మెయిన్ హైలైట్‌గా ఉంటాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ని అందించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సంజయ్ దత్ మెయిన్ విలన్, కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ గా నటించారు. డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :