Wednesday, 15 April 2026 03:09:02 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం యత్నం...

Date : 16 July 2024 12:53 PM

Telugu Rekha Media - కథనాలు / హైదరాబాద్ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్తు సంబంధ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్తు అంతరాయాలను తగ్గించడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతికను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో అస్సెట్ మ్యాపింగ్ ట్రాకింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సంస్థ పరిధిలోని అన్ని 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నెంబర్ పెయింటింగ్ ప్రక్రియను ప్రారంభించారు.ఈ పద్ధతితో విద్యుత్తు సంబంధ సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండటంతో పాటు అంతరాయాలను అరికట్టే వీలుంటుందని సీఎండీ కర్నాటి వరుణ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్ పీడీసీఎల్ ఆఫీసర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ లో అస్సెట్ మ్యాపింగ్ వల్ల స్తంభాల వారీగా పెట్రోలింగ్ సులభంగా చేపట్టే అవకాశం ఉంటుందని సీఎండీ వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా మెయింటెనెన్స్ ను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వీలు ఉంటుందని తెలిపారు. అంతరాయాలు, ట్రాన్స్ ఫార్మర్ల వైఫల్యాలు కూడా ట్రాక్ చేసుకునే సౌల్యభ్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నెంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకునే ఆస్కారం ఉంటుందని, వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించవచ్చని వెల్లడించారు. దీని ద్వారా అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ముందస్తు సమాచారం తెలుసుకోవడానికి, సమస్యలు ఏర్పడక ముందే గుర్తించడానికి ఎంతో దోహద పడుతుందని సీఎండీ వివరించారు. కరెంట్ పోల్స్ కు యూనిట్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇప్పటివరకు సుమారుగా 1,862 ఫీడర్లకు నెంబరింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాటి డిజిటలైజేషన్ తో పాటు ప్రీ మాన్సూన్ ఇన్ స్పెక్షన్ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగతా ఫీడర్లను రాబోయే రెండు నెలల సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని సీఎండీ వివరించారు. ప్రీ మాన్సూన్ ఇన్ స్పెక్షన్ (పీఎంఐ) లో భాగంగా ముందస్తు విద్యుత్ లైన్ల నిర్వహణ కార్యక్రమం చేపట్టి, ఎప్పటికప్పుడు పీఎంఐ ఆప్ లో వివరాలు అప్ లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. పోల్ నెంబర్ పెయింటింగ్ ద్వారా అస్సెట్ మ్యాపింగ్ చేసిన అన్ని రకాల విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను సమయానుసారంగ నిర్వహణ చేపట్టడంతో పాటు అప్ గ్రేడ్ చేసేందుకు కూడా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తద్వారా సమస్యలను పరిష్కరించడం, అంతరాయాల సమయాన్ని తగ్గించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సరఫరా అందించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత సాకేంతికతకు అందుబాటులోకి తీసుకు వచ్చి విద్యుత్తు సంబంధ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వివరించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :