Wednesday, 15 April 2026 03:48:08 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అర్ధం కానీ గులాబీ బాస్ వ్యూహం...

Date : 02 August 2024 11:15 AM

Telugu Rekha Media - కథనాలు / : తెలంగాణ రాజకీయ సీనియర్ నాయకుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరు. టీడీపీ నుంచి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టారాయన. రాజకీయాలు చేయడంలో కేసీఆర్‌కు తిరుగులేదని నేతలు అప్పుడప్పుడు చెబుతున్నారు. చదరంగంలో ఎత్తులు పసిగట్టవచ్చని, కానీ కేసీఆర్ ఎత్తులను అస్సలు ఊహించలేమని కొందరు నేతలు ఓపెన్‌గా చెప్పిన సందర్భాలు లేకపోలేదు.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. కేసీఆర్ గడిచిన పదేళ్లలో ఎలాంటి రాజకీయాలు చేశారో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. వివిధ అంశాలపై మాట్లాడిన నేతలు సడన్‌గా టాపిక్ డైవర్ట్ అయ్యింది. కేసీఆర్ ఎలాంటి కుటిల రాజకీయాలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళ్లకు కట్టినట్టు చూపించారు. రాజకీయ ఎత్తుగడలో ఎమ్మెల్యేలు పావులుగా మిగిలిపోయారు.తెలంగాణ వచ్చిన తర్వాత తొలుత టీడీపీని ఖాళీ చేయించాలని భావించారు కేసీఆర్. ఆయన వేసిన స్కెచ్ వర్కవుట్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై అలాంటి అస్త్రాన్ని ప్రయోగించారాయన. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిని సబితఇంద్రారెడ్డి ద్వారా కాంగ్రెస్‌లోకి రప్పించారు కేసీఆర్. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఓకే అయ్యింది. వెంటనే సబితాను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ఆమెకి మంత్రిపదవి కట్టబెట్టారు గులాబీ బాస్. ఇది కేవలం బుధవారం అసెంబ్లీలో వెల్లడైన విషయాలు.కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి కష్టాలు దేవుడికే తెలియాలి. మల్కాజ్‌‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి, పీసీపీ పదవి ఇవ్వకుండా గులాబీ పెద్దలు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. ఢిల్లీ స్థాయిలో రాజకీయ గేమ్ మొదలుపెట్టేశారు. తెలంగాణ రాజకీయాలను గమనించిన కాంగ్రెస్ పెద్దలు రేవంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం, ఆయనకు పీసీసీ పదవి అప్పగించడం చకచకా జరిగిపోయింది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య లుకలుకలు మొదలయ్యేలా స్కెచ్ వేసింది బీఆర్ఎస్. తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటే.. తాము ఉన్నామని సీనియర్లు తెరపైకి వచ్చేలా చేసింది. చివరకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు అందుకున్నారు. చివరకు కేసీఆర్ రాజకీయ ఎత్తుల్లో ఎమ్మెల్యేలు పావులుగా మారిపోయారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :