Thursday, 09 April 2026 05:35:05 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

చనిపోయిన బాలికకు ఇంకా వైద్యం అందించాలన్న వైద్యులు... తిరగబడ్డ బందువులు...

Date : 05 August 2024 11:30 AM

Telugu Rekha Media - కథనాలు / ఆదిలాబాద్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఠాగూర్ సినిమాను తలపించే విధంగా వైద్యం చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి బాలిక మరణించినా కూడా మెరుగైన వైద్యం కావాలంటూ అంబులెన్స్ ఎక్కించడంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని విజేత హాస్పిటల్ వారిపై బంధువులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన చెందిన ఎస్.డి ఉస్మాన్ పాషా, షబిహా దంపతుల కుమార్తె సనా తబుసుమ్ (15). ఈమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి హైస్కూలులో 10వ తరగతి చదువుతుంది. 2 రోజుల క్రితం విరోచనాలతో నీరస పడితే తల్లిదండ్రులు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్ద చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి పట్టణంలోని విజేత ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్లేట్ లెట్స్ 40వేల నుంచి 14వేలకు పడిపోయి బాలిక మృతి చెందింది.కానీ వైద్యులు మాత్రం బాలిక పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించి అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించిన బందువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సత్తుపల్లి పట్టణ సీ.ఐ టీ.కిరణ్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కావాలని అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం ఎందుకు చేశారని బంధువులు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు.దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్ అవ్వడం, డెంగ్యూ జ్వరంతో కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అవ్వడంతో బాలిక మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అంటున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :