Saturday, 13 June 2026 07:07:28 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...

Date : 06 August 2024 10:42 AM

Telugu Rekha Media - కథనాలు / నల్గొండ : ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు పెద్దఎత్తున వచ్చిచేరుతున్నది. క్రమంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు.. సాగర్‌ గేట్లు తెరిచారు. ఒక్కొక్కటిగా మొత్తం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఉదయం 11 గంటలకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌ కుమార్‌ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగు ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్‌ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తారు. ప్రస్తుత సాగర్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం రెండు పంటలకు ఇకా ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సోమవారం ఉదయం 8 గంటలకు సాగర్‌కు 4,41,183 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఔట్‌ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉన్నది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :