Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / జనగాం : వ్యవసాయ బావుల వద్ద కాపర్ వైర్ చోరీకి గురవుతుండడంతో రైతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు. రఘునాథపల్లి మండల కేంద్రంలోని కందుల అనిల్ కుమార్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో అమర్చిన పంపుసెట్ల వద్ద స్టార్టర్కు ఉండే విద్యుత్ వైర్ ను శుక్రవారం రాత్రి దొంగలు చోరీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు మండల కేంద్రంలో గతంలో సుమారు ముప్పై మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందని బాధిత రైతులు తెలిపారు. ఇదిలా ఉంటే కందుల అనిల్ కుమార్ కు చెందిన స్టార్టర్ విద్యుత్ వైర్ ఒకే నెలలో మూడు సార్లు చోరీ కావడం పట్ల ఈ రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి దొంగల ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు.
Reporter
Telugu Rekha Media