Saturday, 13 June 2026 06:54:53 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కడప జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం...

Date : 27 June 2024 12:31 PM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / వైఎస్ఆర్ కడప : జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిఘా వందరోజుల కార్యాచరరణ ప్రణాళిక తో గంజాయి కట్టడికి శ్రీకారం ప్రజలు పోలీసు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలి జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ వెల్లడి.

జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కొరడా ఝుళిపించేందుకు వందరోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవారిని మళ్ళీ నేరాలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పదే పదే గంజాయి నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు పి.డి యాక్ట్ ప్రయోగించడం జరుగుతుందని ఎస్.పి తెలిపారు.. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నాకాబందీ నిర్వహించి అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు గంజాయికి సంబంధించిన సమాచారాన్ని 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యత గా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గంజాయి సేవించే వ్యసనానికి బానిసగా మారిన వారి సమాచారమిస్తే వారిని రిమ్స్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లోని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించి తిరిగి వారిని సమాజంలో సాధారణ వ్యక్తుల్లా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని ఎస్.పి వివరించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :