Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి నగరం రాయల్ నగర్ లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఒక కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు కత్తితో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనతో నగరం ఉలిక్కిపడింది. దుండగులు బాలికను గొంతు కోసి మరో బాలికపై, తల్లిపై కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ రాయల్ నగర్ లో మర్డర్ జరిగిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించాం. మర్డర్ కు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయన్నారు. బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసులు కుటుంబంపై దాడి చేశారని, శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో దాడి చేసారని అన్నారు. శ్రీనివాసులు తల్లి జయలక్ష్మిపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు చిన్న కుమార్తె నియాతిపై కత్తితో దాడి చేశారని తెలిపారు.డ్రైవింగ్ క్లాస్ కు వెళ్ళి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష, పెద్ద కుమార్తె ప్రేరణ పైనా కత్తితో దాడి చేసి గాయపరచారన్నారు. దాడి చేసిన తర్వాత నిందితుడు బురఖా లో తప్పించుకున్నట్లు సిసి కెమెరాలో ఫుట్టేజ్ లభించాయని చెప్పారు. కుటుంబ తగాదాలే కారణమని అనుమానిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదించి నిందితులను అదుపులో తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఘటనపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందించారు. రాయల్ నగర్ ఘటన బాధాకరం. నిందితుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
Reporter
Telugu Rekha Media