Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / విశాఖపట్నం : విశాఖలో దారుణం చోటు చేసుకుం ది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపం లోని శ్రీకృష్ణ నగర్ వద్ద వికలాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తుల తో నరికి చంపేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా గుర్తించారు పోలీసులు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుందడంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేశారు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. హత్య చేయించారా లేదంటే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Admin
Telugu Rekha Media