Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / : బెంగళూరు (తెలుగు రేఖ న్యూస్): ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప & నటి పవిత్ర గౌడ తమ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. అభిమాని రేణుకా స్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరు డ్రైనేజీలో లభ్యమైంది. దర్శన్కు చెందిన జీపుతో సహా హత్యకు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్శన్ ను మైసూర్ ఫామ్హౌస్ లో అరెస్టు చేసారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్తో పాటు మరో 11 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Admin
Telugu Rekha Media