Saturday, 13 June 2026 08:18:04 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హస్తం గూటికి మరో ఎమ్మెల్యే...

Date : 24 June 2024 03:50 PM

Telugu Rekha Media - రాజకీయం / జగిత్యాల్ : ప్రతిపక్ష BRS పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి BRS ను వీడి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ భావజాలంతో కలిసి పనిచేసే వారిని అందర్నీ కలుపుకుని వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కొన్ని నెలలపాటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ స్థానాలు నెగ్గడంపై ఫోకస్ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై రేవంత్ దృష్టిసారించారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్ నేత కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మూడో రోజుల కిందట పోచారం హస్తం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీలో పదవులు అనుభవించి, కష్టకాలంలో బీఆర్ఎస్ కు అండగా ఉండాల్సింది పోయి, ఈ వయసులో పార్టీ మారడం సిగ్గుచేటంటూ విమర్శించారు.గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారు కేసీఆర్. టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడంతో టీడీఎల్పీ విలీనం చేసినట్లు అయింది. 2014 ఎన్నికల తరువాత వైఎస్సార్ సీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం కారు పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వచ్చినా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీలో చేరిపోయారు. గత ఏడాది నవంబర్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. మొదట తాను మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను కలిశానని చెప్పారు. ఆపై కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ కనిపించి కేసీఆర్ కు షాకిచ్చారు వెంకట్రావు. ఇంకా చెప్పాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ కు షాకిస్తూ బీఆర్ఎస్ ను వీడిన తొలి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హస్తం గూటికి వెళ్లారు.లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలో చేరి టికెట్లు సైతం సాధించారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఇచ్చినా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు కడియం శ్రీహరి, కడియం కావ్య. లోక్ సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపొందారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం కేసీఆర్ ను పునరాలోచనలో పడేసింది. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేత బీఆర్ఎస్ ను వీడగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీకి వచ్చారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :