Thursday, 30 July 2026 04:09:18 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ...!

-- మీ వెంట నేనున్నాంటూ ”ప్రజాదర్బార్” లో లోకేష్ భరోసా.

Date : 18 June 2024 01:42 PM

Telugu Rekha Media - రాజకీయం / గుంటూరు : మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కష్టాల్లో ఉన్న ప్రజలకు స్వాంతన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ ఉంటున్నారు. సాధారణంగా సిఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు. వందలమంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి లోకేష్ ప్రతిఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా పెద్దసంఖ్యలో ప్రజలు లోకేష్ ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.

మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు పెన్షన్ వితంతు మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్ కు చెందిన బి.దుర్గా ప్రసాద్ తమకు ఇంటిపట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళగిరి 19వ వార్డుకు చెందిన చిల్లపల్లి వీరమ్మ తల్లిలేని తన మనవడి చదువుకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఒంటరి మహిళ పెన్షన్ ను పునరుద్ధరించాలని మంగళగిరి 12వ వార్డుకు చెందిన టి.జయమణి కోరారు. చేనేత కార్మికురాలైన తనకు ఇంటి స్థలం మంజూరుచేయించి ఆదుకోవాలని మంగళగిరి కొప్పురావుకాలనీకి చెందిన గంజి లత నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో నిరసన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్ లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు, 23శాతం వేతన సవరణ, 9 నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. బీటెక్ చదివిన తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన వి.దుర్గామల్లేశ్వరి కోరారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: