Wednesday, 29 July 2026 02:00:08 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బీఆర్ఎస్ కు మరో భారీ షాక్...

మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం

Date : 05 July 2024 11:20 AM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగిపోతున్నారు. హస్తం గూటికి చేరుతున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు రేవంత్ కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా.. 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రె్సకు ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరఫునే ఉంటారు. మొత్తం 8 మంది అవుతారు. తాజాగా ఆరుగురు చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రె్సకే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రె్సకు మరో ఐదారు సీట్లు ఉంటే మెజారిటీ దక్కుతుంది. బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ఎ్సతో కలిసి పనిచేసే అవకాశం లేదు. అప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కారుకు ఊరట లభిస్తుంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: