Saturday, 13 June 2026 08:18:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రుణమాఫీతో బీజేపీ,బిఆర్ఎస్ వాళ్లకు నిద్రపట్టడం లేదు...

-రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయగానే రైతుల ఇళ్లల్లో సంబరాలు. -ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆందోళనలు మొదలైనాయి. -- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

Date : 19 July 2024 10:15 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : రుణమాఫీతో బీజేపీ,బిఆర్ఎస్ వాళ్లకు నిద్రపట్టడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రైతులు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ 2లక్షల రుణమాఫీ మొదలైందని, నిన్న లక్ష వరకు రుణాలు ఉన్న వారికి మాఫీ అయ్యిందని తెలిపారు. ఆగస్టు పదిహేను వరకు 2లక్షల రుణమాఫీ అవుతుందని దీనితో బీజేపీ, బిఆర్ఎస్ వాళ్లకు నిద్రపట్టడం లేదన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయగానే రైతుల ఇళ్లల్లో సంబరాలు.. ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆందోళనలు జరిగాయన్నారు.కొందరు బీజేపీ,బిఆర్ఎస్ నేతలు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నారని ఎద్దేవా చేసారు.హరీష్ రావు ఫైనాన్స్ మినిస్ట్స్, మీ మామా సీఎం గా ఉండి.. పది ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారు.అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం 26 వేల కోట్లు మాత్రమే నన్నారు.సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31వేల కోట్ల రుణమాఫీ మొదలైంది.నాలుగున్నర ఏళ్ల సమయం ఉన్న.. ఆరు నెలల్లోనే రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు.బీజేపీ పదేళ్లు కేంద్రంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో బండి సంజయ్.. కిషన్ రెడ్డిలు చెప్పగలరా.. అని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.పదేళ్లలో నిరో మోడీ.. విజయ్ మాల్యా లాంటి పది మందికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు.అందులో రైతులు ఉన్నారా చెప్పండి అని డిమాండ్ చేసారు.యూపీఏ హాయంలో ఒకే సారి 75వేల కోట్లు రుణాలు మాజీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.పదేళ్లలో రైతులు కేసిఆర్ మీద పెట్టుకున్న ఆశలను.. కూని చేశారని విమర్శించారు.బీజేపీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు తెచ్చి.. రైతు హత్యలు చేశారు. దీని మీద చర్చకు వస్తారా బండి సంజయ్.. కిషన్ రెడ్డిలను ప్రశ్నించారు.ఢిల్లీలో రైతులు నిరసనలు తెలిపితే.. మంత్రుల పిల్లల వాహనాలతో మర్దర్లు చేశారు.రైతుల పక్షాన అన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. డిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే ఎందుకు చిరంజీవి మద్దతు తెలుపలేదు.చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫాట్తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ కి మద్దతు ఇస్తుంటే రైతుల గురించి ఎందుకు చెప్పలేక పోతారు.డిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే.. రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా జగా రెడ్డి గుర్తు చేసారు.రైతుల పేరుతో సినిమాలు తీసి.. కోట్లు సంపాదించుకొని,బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు.కేటీఆర్ ట్వీట్ కే పని కి వస్తాడు.. పనికి పనికిరాడురైతులకు ఒకే సారి రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందుకే లక్ష.. లక్షన్నర.. రెండు లక్షలు అన్న విడతలు పెట్టాం. అప్పులు ఎక్కడ తెచ్చారు అనేది సీఎం, ఆర్థిక మంత్రులకే తెలుసునన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :