Telugu Rekha Media - జిల్లా వార్తలు / శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఆయిల్ తయారుకి వినియోగించే ఎండు కొబ్బరి భద్రపరచే గదిలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా కొబ్బరి చిప్పలు భద్రపరిచిగుది మొత్తం అగ్నికి ఆహుతి అయింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి.విషయం తెలియగానే శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రంగంలో దిగిన దేవస్థానం అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
Reporter
Telugu Rekha Media