Wednesday, 15 April 2026 02:58:34 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత...

పచ్చదనం - స్వచ్చధనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. -- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

Date : 09 August 2024 10:46 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం-పచ్చధనం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పురపాలక శాఖ ఆధ్వరంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మొక్కలు నాటారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్బన్ పార్కుతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం వాతావరణం లభించిందన్నారు.. వాచ్ టవర్ ఏర్పాటు తో అడవి మరియు పట్టణం వీక్షించడం వల్ల కనువిందు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు.. డబల్ బెడ్ రూం ఇండ్ల వద్ద సైతం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వృక్షో రక్షితి రక్షితః.. మనం మొక్కల్ని రక్షిస్తే మొక్కలు మనల్ని రక్షిస్తాయిని, పట్టణ ప్రజలు తడి పొడి చెత్త వేరు చేయటం ద్వారా ఎరువులు తయారు చేయవచ్చు అని, పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని అన్నారు. పట్టణంలో పలు చోట్ల పార్కులు కూడా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛధనం- పచ్చధనం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీం రావు, డీఎస్పీ రఘు చందర్, కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, సిఐ కృష్ణ రెడ్డి,ఏవో శ్రీనివాస్, కౌన్సిలర్ లు పంబల రాంకుమార్ త్యాదాస్ నవీన్ జుంబర్తి రాజ్ కుమార్ కోసరి అనిల్ ముస్కు నారాయణ రెడ్డి, కో ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు క్యదాసు నాగయ్య, కూతురు శేఖర్, ప్రభాత్ సింగ్ ఠాగూర్, దుమాల రాజ్ కుమార్, శరత్ రావు, గట్టు రాజు, పోతునుక మహేష్, క్రాంతి, కొలగాణి సత్యం, ప్రవీణ్, లవంగ శ్రీనివాస్, రాజమల్లు, మేక పవన్, ఎస్ఐలు, ఆర్ఐలు, అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :