Wednesday, 29 July 2026 04:45:52 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి కి కృషి చేస్తా...

-- ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

Date : 09 August 2024 09:25 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / రాజన్న సిరిసిల్ల : పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వీటిడీఏ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ,నిధులు రూ. 30 లక్షలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా నూతనంగా తీర్చిదిద్దే పనులకు, వేములవాడ లోని మురుగు నీరు రాజన్న ఆలయ గుడి చెరువులో కలవకుండా వేములవాడ మున్సిపల్ నిధులు రూ. 3 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం వీటిడీఏ నిధులు రూ. 2 కోట్లతో వేములవాడ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో పార్క్, ఈ సందర్భంగా పార్క్ లో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ను నిర్మించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజన్న ఆలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఒక మినీ పార్కు లాగా ఏర్పాటు చేస్తామని వివరించారు.గుడి చెరువులో కలుస్తున్న మురుగునీరు పట్టణ అవతలి వైపు నుండి తీసుకుపోవడానికి రూ.మూడు కోట్లతో నేడు భూమి పూజ చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాజన్న ఆలయానికి 50 కోట్ల నిధులు.మొదటి ప్రాధాన్యతలో ఆలయ విస్తరణ చేపడతామని, ఇటీవలే రాజన్న ఆలయానికి 50 కోట్ల నిధులను కేటాయించామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. వీలైనంత త్వరలో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.గతంలో నేను శృంగేరి పీఠం ని దర్శించుకున్న సమయాన రాజన్న ఆలయ అభివృద్ధిపై వారితో చర్చించానని గుర్తు చేశారు.ఈ సందర్భంగా పార్క్ లో ఏర్పాటు చేసిన ఆట బొమ్మలు, పరికరాలు ప్రభుత్వ విప్, కలెక్టర్ అందరితో కలిసి పరిశీలించారు. పార్క్ ఆవరణలో ఆధునిక టెక్నాలజీతో టాయిలెట్స్ పురుషులు, మహిళల కోసం రెండు వేరువేరుగా నిర్మించాలని, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, స్నాక్స్ కోసం స్టాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ సూచించారు. పట్టణంలోని చిన్నారులకు మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్ కు ఎంత ఉపయోగపడు తుందని పేర్కొన్నారు.కార్యక్రమాల్లో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు, కమిషనర్ అన్వేష్, వీటీడీఏ సెక్రటరీ అన్సారీ, తహసిల్దార్ అర్బన్ మహేష్ కుమార్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: