Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల : నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ కళాశాల మైదానంలో ఆగస్టు 15 (గురువారం) స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోలీస్ కవాతు రిహార్సల్స్ ను నేడు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గవర్నమెంట్ కళాశాల మైదానానికి రాగానే ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం పోలీస్ పెరేడ్ రిహార్సల్ లో భాగంగా జిల్లా ఎస్పీ పెరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం కవాతు పరిశీలన వాహనంలో జిల్లా ఎస్పీ వెళ్ళి ఆర్మూర్ రిజర్వ్ బలగాలు, సివిల్ పోలీసులు, మరియు హోంగార్డ్స్ తో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను పరిశీలించి పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలిస్తూ వివిధ విభాగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజల గ్యాలరీల ఏర్పాట్లు, కల్పించాల్సిన భద్రత మొదలగు సౌకర్యాల గురించి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఇన్స్పెక్టర్లు నరసింహులు, మంజునాథ్ ,శ్రీనివాసులు ఆర్ఎస్ఐ లు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media