Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : జగిత్యాల నియోజకవర్గంలో సేవే ధ్యేయంగా అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ అన్నారు..బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ, అర్బన్ మండలానికి చెందిన 243 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 80 లక్షల 52 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పంపీణీ చేశారు..ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం సహాయ నిధి చెక్కులు పేదల పాలిట వరం మారిందన్నారు.. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా 4,520 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు.తాగు నీటి కోసం 14 కోట్ల తో 14 లక్షల లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగింది.. నియోజకవర్గంలో సేవే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని సేవా చేసే ఉద్దేశం తోనే రాజకీయాలకి వచ్చానని తెలిపారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ ఏఎంసీ ఛైర్మెన్ దామోదర్ రావు,మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిదులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media