Telugu Rekha Media - జిల్లా వార్తలు / భూపాలపల్లి : రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రూల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండలంలోని ఆకినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం పెద్దకోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ములకలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్ట్ లను అందజేశారు. అనంతరం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పిఎసిఎస్ గోదామును మరియు కార్యాలయాన్ని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇస్సిపేట గ్రామంలో పిఎసిఎస్ గోదామును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఊబిలోకి నెట్టిందని అన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశాడని ఆరోపించారు. కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా పోగేసి రైతు రుణమాఫీ చేయడానికి అహర్నిశలు కష్టపడి పని చేశారని అన్నారు.
Reporter
Telugu Rekha Media