Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : గత 3 సంవత్సరాలుగా నిలిచిపోయిన తమ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తమ చదువుకు ఆటంకం కల్పించవద్దని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు డిగ్రీ కళాశాల విద్యార్థులు కొత్త బస్టాండ్ చౌరస్తా నుండి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి తమ ఆవేదన వెలుబుచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెంటనే తమ యొక్క స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి తమ ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా దోహదపడాలని విద్యార్ధులు కోరారు..
Reporter
Telugu Rekha Media