Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : కన్న తల్లి,దండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులు ,కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ,బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రాలు రాసిచ్చారు.శుక్రవారం సీనియర్ సిటీజేన్స్ జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రం కు ఆ కొడుకులు, కోడళ్లను ఆ వృద్ద తల్లిదండ్రుల అభ్యర్థన పై పిలిపించి వయోవృద్ధుల చట్టం పై అవగాహన కల్పించి,తల్లిదండ్రులను పోషించక నిరాదరణకు గురిచేస్తే ట్రిబ్యునల్ అధికారి ఆర్డీవో 6 మాసాలకు పైగా జైలు శిక్ష,జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని,మాయ మాటలతో,బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉందని కౌన్సిలింగ్ చేశారు.జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధ తల్లిదండ్రులు కందుల శంకర్ ,సుగుణమ్మలను ఆమె పెద్ద కుమారుడు ,పెద్ద కోడలు,చిన్న కొడుకు,చిన్న కోడలు పోషించక వేధింపులకి గురి చేస్తున్నారని ,పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెంది జగిత్యాల లో అద్దెకు ఉంటున్న తల్లిదండ్రులు చింతల రాజయ్య,భాగ్యమ్మలను జగిత్యాల లోనే వ్యాపారాలు చేసుకుంటున్న ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు ,కోడలు వేధింపులకు గురిచేస్తున్నారని ,పోషణ ,వైద్య ఖర్చులు ఇవ్వడం లేదని చిన్న కొడుకు మాత్రమే సంరక్షణ చూస్తున్నాడని సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ కమిటీ జిల్లా ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం,వెల్ములప్రకాశ్ రావు,పట్టణ ప్రతినిధులు పి.సతీశ్ రాజ్, సింగం గంగాధర్,ఎండి.యాకూబ్, తదితరులు ఆ కనికరం లేని కొడుకులు,కోడళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం తో వారు ఆ తల్లిదండ్రులను పోషిస్తామని,లేకుంటే తమపై చట్ట ప్రకారము ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీవో కు కేసు దాఖలు చర్యలు తీసుకోవాలని ఒప్పంద పత్రం రాసిచ్చారని జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.
Reporter
Telugu Rekha Media