Wednesday, 29 July 2026 03:08:59 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బయటపడుతున్న బీఆర్ఎస్ వైఫల్యాలు...

Date : 09 August 2024 03:18 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / సిద్ధిపేట : ములకనూరు లో రైతు అవగాహన సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు..అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారు. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. మేము సవాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వ పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ దానిని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారు. గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏనాడూ నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు. మంచిది కాదు బిఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నమస్తే తెలంగాణ పేపర్ లో నిలువునా విరిగిపడ్డ సుంకి శాల కోడ కూలీ తృటిలో తప్పిన పెను ప్రమాదం అంటున్నారు. ఈ పని జరిగింది బిఆర్ఎస్ హయంలో, దీనికి సంబంధించిన కారణాలపై విచారణకు అదేశిస్తున్నం. ముఖ్యమంత్రి సూచన మేరకు హైదారాబాద్ ఇంచార్జి మంత్రి గా నీళ్ళు హైదారాబాద్ కి తీసుకొచ్చే ప్రక్రియ లో భాగంగా మున్సిపల్, హెచ్ఎం డిఎ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పూర్తిగా విచారణకు అదేశిస్తున్నాం. దీనికి కారణం పూర్తిగా దోషి బిఆర్ఎస్, మీరు విచారణకు సిద్ధమా.? ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు, బిఆరెస్ తప్పులను ప్రజల ముందు చూపెడతాం. మసిపూసి బట్ట కాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బిఆర్ ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్ననే కాళేశ్వరం కి సంబంధించి లోప భూయిస్ట నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. రైతు వేధికల్లో రైతులు చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వచ్చిన ప్రయోజనాలు గత 10 ఏళ్లలో రాలేదంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత బాగవుతుందనుకున్నం అంత హీనంగా జరిగిందని రైతులే స్వయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ, రుణమాఫీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకీ శాల పై కూడా విచారణకు ఆదేశిస్తున్నం..సమగ్రమైన రిపోర్ట్ తెప్పించ్చుకొని ఆనాడు బిఆరెస్ హయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తామని అన్నారు. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. బిఆరెస్ పార్టీ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో సోషల్ మీడియా లో గిరిజన మహిళా అని చూడకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు చేశారు. అసందర్భమైన ఆరోపణలతో శాసన సభ లో సరైన విధంగా జవాబులు చెప్పలేక. స్పీకర్ గారు దళితుడు అని దొర తనంతో అధ్యక్ష అని పిలువలేక శాసన సభకు రాలేకపోయారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో గ్యారంటీ స్కీమ్స్ అమలు కానీ 200 యూనిట్ల లబ్ధి జరగని వారిని,500 గ్యాస్ రాని వారిని కరెక్షన్ చేసుకొమ్మని చెప్తున్నాం. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం. ఒక భీమదేవరపల్లి మండలంలో 21 కోట్లు రైతు రుణమాఫీ వచ్చింది 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: