Saturday, 13 June 2026 07:55:26 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పీఎం కిసాన్ నిధుల విడుదల...

-- రైతుల ఖాతాలోకి రూ.20 వేల కోట్లు

Date : 19 June 2024 02:54 PM

Telugu Rekha Media - జాతీయం / : రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన -కిసాన్‌ సమ్మాన్‌నిధి 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌, కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమకానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తోంది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :