Telugu Rekha Media - జాతీయం / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారిని, తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ని ఢిల్లీలోని సీఎం నివాసంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ ఎంపీగా అఖండ విజయం సాధించి మొదటి సారి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూ ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేయనున్న డాక్టర్ కడియం కావ్య కి సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి గారు శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Telugu Rekha Media