Telugu Rekha Media - జాతీయం / : న్యూ డిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. తగ్గింది వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.చమురు సంస్థల నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,676గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,646కి తగ్గింది. అదేవిధంగా ముంబైలో రూ.1,629 నుంచి రూ.1,598కి తగ్గింది. ఇక చెన్నైలో రూ.1,840గా ఉన్న ధర ఇప్పుడు రూ.1,809కి పడిపోయింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1,787 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,756కి తగ్గింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, వరుసగా గత రెండు నెలల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్1న ఎల్‌పీజీ రేటు దాదాపు రూ.69 తగ్గగా, మే 1న సిలిండర్‌పై రూ.19 తగ్గింది. ఇక 14.2 కిలోల గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Admin
Telugu Rekha Media