Saturday, 13 June 2026 08:03:59 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్...

-- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

Date : 28 July 2024 11:01 AM

Telugu Rekha Media - జాతీయం / : వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2024-25 రూపొందించడం జరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో, ప్రదాని మోడీ నేతృత్వంలోని ఎన్డిఏప్రభుత్వం ఉపాధి, నైపుణ్యం, MSMEలు మరియు మధ్యతరగతిపై ప్రధాన దృష్టి సారించింది. దేశ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం. పేదల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. బడ్జెట్ లో రైతుల శ్రేయస్సు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఉత్పాదకత, వ్యవసాయం, యువతకు ఉపాధి వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చాం. గత యూపీఏ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు. దేశంలోనే అతిపెద్ద పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగించడం గొప్ప విషయం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. వాతావరణానికి అనుగుణంగా కొత్తగా 109 అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతుల సాగు కోసం విడుదల చేయబడతాయి. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గేమ్ చేంజర్ గా నిలిచే హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌తో సహా రూ. 60 వేల కోట్ల విలువైన రహదారులను తెలంగాణలో నిర్మించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లు విస్తరణ చేస్తాం. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజన పథకాన్ని అమలు చేయలేదు. సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు. ముఖ్యమంత్రికి ఏవైనా విభేదాలు ఉంటే.. తన అభిప్రాయాన్ని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై తెలపాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించినందునే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వారి స్థానం ఏంటో ప్రజలు తెలియజేసేలా తీర్పునిచ్చారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :