Thursday, 09 April 2026 05:35:05 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు...

-- కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి స్వతంత్ర హోదా అర్జున్ మేఘ్వాల్ వెల్లడి.

Date : 17 June 2024 06:11 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ, (తెలుగు రేఖ న్యూస్) : మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ్ సంహిత, భారతీయ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అభినయం, ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి స్వతంత్ర హోదా అర్జున్ మేఘ్వాల్ ఆదివారంనాడు తెలిపారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు. మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అసవరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ (బిపిఆర్డి) అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్శిటీలకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. కాగా, భారతీయ నాగరిక్ సురక్ష సింహత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించనున్నారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు, ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు సీఆర్‌పీసీలోని, 484 సెక్షన్ల స్థానలో ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్‌ సెక్షన్లు చేర్చారు. భారతీయ సాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు ఒరిజనల్, ప్రొవిజన్లు 167, ఉండగా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకువచ్చారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :