Saturday, 13 June 2026 06:59:26 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

దాల్ సరస్సు ఒడ్డున ప్రధాని నరేంద్ర మోడీ యోగా...

Date : 21 June 2024 11:10 AM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ, (తెలుగు రేఖ న్యూస్) : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా నేడు శుక్రవారం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్‌లో జరుపుకోనున్నారు. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఆయన యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోదీ, యువతతో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొన్ని ఉగ్రవాద ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన దృష్ట్యా, మొత్తం శ్రీనగర్‌ను రెడ్ జోన్‌గా మార్చారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్, దాల్ సరస్సు చుట్టూ పక్షులు కూడా తిరగలేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ప్రధాని తన పర్యటన లో జమ్మూ కాశ్మీర్‌కు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. అనంతరం నేడు ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. 2015 నుంచి ప్రతిఏటా యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రధాని నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూర్, న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక ప్రదేశాలలో యోగా దినోత్సవ వేడుకల కు ఆయన నాయకత్వం వహించారు. ఈ ఏడాది యోగా దినోత్స వం థీమ్ 'యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ', వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించ డంలో దాని ద్వంద్వ పాత్రను హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అట్ట డుగు స్థాయి భాగస్వామ్యా న్ని, యోగా వ్యాప్తిని ప్రోత్స హిస్తుందని పీఎంఓ తెలిపింది.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :