Saturday, 13 June 2026 07:06:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తన ప్రసంగం నుంచి తొలగించిన అంశాలను పునరుద్ధరించండి...

Date : 03 July 2024 06:31 AM

Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : ప్రతిపక్ష నాయకుడిగా తాను లోక్ సభలో చేసిన ప్రసంగం నుంచి తొలగించిన అంశాలను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం లేఖ రాశారు. స్పీకర్ ఏరికోరి కొన్ని అంశాలను కావాలనే తొలగించారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు.‘‘ నేను మీ దృష్టికి అనురాగ్ ఠాకుర్ ప్రసంగం విషయాన్ని కూడా తీసుకు రావాలనుకుంటున్నాను. ఆయన ప్రసంగం అంతా ఆరోపణలతో కూడుకున్నవి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఒకే ఒక పదాన్ని తొలగించినట్లు ఆయన చెప్పారు. కానీ ఏరికోరి అనేక అంశాలు తొలగించారు’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.స్పీకర్ చర్య లోక్ సభ నియమాలకు వ్యతిరేకంగా ఉందని కూడా రాయ్ బరేలి ఎంపీ అయిన రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ రూల్ 380 కింద మీరు తొలగించిన అంశాలు రావు, ఇక సభలోని ప్రతి సభ్యుడికి తన వాదనను వినిపించే హక్కు రాజ్యాంగం లోని ఆర్టికల్ 105(1) కల్పించింది. ప్రజల అంశాలను సభలో లేవనెత్తే హక్కు ప్రతి సభ్యుడికి ఉంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఇంకా ‘‘స్పీకర్ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకనే నా ప్రసంగం నుంచి తొలగించిన అంశాలను పునరుద్ధరించాలి’’ అన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నీట్ పరీక్ష అక్రమాలు, బిజెపి, మోడీ,ఆర్ఎస్ఎస్, హిందూ మతం, అగ్నివీర్ వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ‘జై సంవిధాన్’ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు కేంద్ర మంత్రులు, ఎంపీలు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :