Thursday, 30 July 2026 04:51:41 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

లోక్ సభ స్పీకర్ బిజెపి ఎంపి ఓంబిర్లా ఎన్నిక...

Date : 27 June 2024 09:11 AM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : లోక్ సభ స్పీకర్ బిజెపి ఎంపి ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఎన్‌డిఎ తరపున ఓంబిర్లా రెండో సారి లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థిపై ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి గెలుపొందారు. లోక్ సభ స్పీకర్‌పై పదవిపై పాలక పక్షం, విపక్షాల మధ్య ఏకాభ్రిపాయం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఎన్‌డిఎ తరుఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున కె సురేష్ పోటీ చేశారు. ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్‌డిఎ ఎంపిలు బలపరిచారు. ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంబిటి ఎంపి అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ కూటమి ఎంపిలు బలపరిచారు. మూజువాణీ ఓటింగ్ చేపట్టడంతో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వెల్లడించారు. ఓం బిర్లాను సభాపతి స్థానం వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తీసుకెళ్లి స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. 2024 లోక్ సభ ఎన్నికలలో రాజస్థాన్‌లోని కోట నుంచి ఆయన ఎంపిగా గెలిచారు. కోట నుంచి ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎంపిగా విజయం సాధించారు. మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాభినందనలు తెలిపారు. వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: