Saturday, 13 June 2026 06:57:18 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్...

Date : 28 July 2024 11:13 AM

Telugu Rekha Media - జాతీయం / : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి పాటించనందున నిరసనగా ఆమె ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.‘‘ చంద్రబాబు నాయుడుకు మాట్లాడటానికి 20 నిమిషాలు కేటాయించారు. ఇంకా అస్సాం, గోవా ముఖ్యమంత్రులు మాట్లాడటానికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారు. కానీ నేను ఐదు నిమిషాలు మాట్లాడక ముందే నన్ను నిలువరించారు. అందుకనే నేను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను’’ అని మమతా బెనర్ఝీ వివరించారు.ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. అయితే కేంద్రానికి, ప్రతిపక్ష పాలిత రాష్టాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్రం ఏకపక్ష కేటాయింపులు చేసిందంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. ఇండియా కూటమికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ సమవావేశానికి హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సూఖు, కేరళ ముఖ్యమంతిర పినరయి విజయన్ వంటి మహామహులు అంతా ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న లక్ష్యంతో నేటి నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :