Thursday, 30 July 2026 06:34:26 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చు...

Date : 11 July 2024 10:10 AM

Telugu Rekha Media - జాతీయం / : ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. భార్య భరణ హక్కుకు సంబంధించిన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం... భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కును సూచించే పాత CrPCలోని సెక్షన్ 125 ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. భరణం అనేది దాతృత్వం కాదని, వివాహిత మహిళల హక్కు అని, వారి మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందని బెంచ్ నొక్కి చెప్పింది. ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ ఆర్డర్‌లో జోక్యం చేసుకోకూడదన్న తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసిన మహ్మద్ అబ్దుల్ సమద్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు CrPCలోని సెక్షన్ 125 కింద భరణం పొందే అర్హత లేదని, బదులుగా ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986 ప్రకారం ఉపశమనం పొందాలని సమద్ వాదించారు. “సెక్షన్ 125 పెళ్లయిన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని.. ఈ క్రిమినల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతున్నాం” అని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ నాగరత్న అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: