Thursday, 30 July 2026 04:50:09 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది...

2023-24 ఆర్థికసర్వేను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.

Date : 22 July 2024 11:45 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ డిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది.ఈ క్రమంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా ఇవాళ 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొంది.2022 నుంచి ప్రైవేటు రంగం పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడులు మూలధనాన్ని కొనసాగించాయని ఈ ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా 7.0 శాతం వృద్ధిరేటును నమోదు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 9.7 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఈ ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొన్ని నిర్దిష్ట ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణం చాలావరకు నియంత్రణలో ఉందని తెలిపింది.2023 కంటే 2024లో వాణిజ్యలోటు తక్కువగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు దాదాపు 0.7 శాతంగా ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేసినట్లు తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొన్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే సూచించింది. 2023-24 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించింది.ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. ఇక ఆర్థికమంత్రిగా నిర్మలాసీతారామన్‌ ఏడోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ఐదుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఆయన రికార్డును నిర్మలాసీతారామన్‌ గత ఏడాదే బద్దలుకొట్టారు. ఇప్పుడు ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకోబోతున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: