Wednesday, 29 July 2026 02:59:13 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌...

-- ప్రధాని మోదీ

Date : 30 July 2024 10:23 PM

Telugu Rekha Media - జాతీయం / : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా ప్రస్ధానం అనే అంశంపై కేంద్ర బడ్జెట్‌ 2024-25పై సీఐఐ నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. పధకాలను పూర్తి చేసేందుకు గత ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచలేదని దుయ్యబట్టారు.గత పదేండ్లుగా తాము ఆ పరిస్ధితిని మార్చివేశామని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము రైల్వే బడ్జెట్‌ను 8 రెట్లు పెంచామని, హైవేల బడ్జెట్‌ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్‌ను 4 రెట్లు పెంచామని తెలిపారు. రక్షణ బడ్జెట్‌ను రెండింతలు పైగా పెంచామని చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో లక్షలాది కోట్ల రూపాయల విలువైన అవినీతి కుంభకోణాలు వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము శ్వేతపత్రం రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందుంచామని చెప్పారు. మనం ఎక్కడ ఉన్నామనేదానిపై చర్చ జరగాలని చెప్పారు.భారత పరిశ్రమలను నూతన శిఖరాలకు చేర్చామని తెలిపారు. దేశ అభివృద్ధికి మూలధన వ్యయం కీలకమని 2004లో యూపీఏ తొలి బడ్జెట్‌లో మూలధన వ్యయం కేవలం రూ. 90,000 కోట్లు కాగా, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు పైగా మూలధన వ్యయం వెచ్చిస్తోందని ఈ నిధులతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇవాళ మనం వికసిత్‌ భారత్ దిశగా పయనిస్తున్నామని, ఈ మార్పు కేవలం సెంటిమెంట్లతో రాలేదని, ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రపంచంలో మనం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగామని, భారత్‌ త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: