Saturday, 13 June 2026 08:01:15 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తాం ...

-- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Date : 27 June 2024 02:27 PM

Telugu Rekha Media - జాతీయం / : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. స్నేహితుడు చంద్రబాబు నాయకత్వంలో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశ ప్రగతితోపాటు ఏపీ అభివృద్ధికి సాధ్యమైన మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు నరేంద్ర మోదీని కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు ఈరోజు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. దీనికి టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :