Saturday, 13 June 2026 07:54:38 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జూన్ 22 న జిఎస్ టి మండలి సమావేశం...

Date : 13 June 2024 08:15 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్): వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) మండలి జూన్ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్ టి కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.జిఎస్ టి కౌన్సిల్ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు.బెట్టింగ్ వాటి మీద జిఎస్ టి 28 శాతం వేయడం వల్ల జిఎస్ టి ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలు వంటి వాటిమీద అధిక జిఎస్ టి విధించబడుతోంది. గుర్రపు పందేలాడేవారికి జిఎస్ టి తో పాటు ఎంట్రీ ఫీజు కూడా గణనీయంగానే ఉంది. హైదరాబాద్ లో ఆఫ్ కోర్సు టోట్ ఎంట్రీ ఫీజు రూ. 150 వరకు ఉంది. ఇక రేస్ కోర్స్ మెయిన్ ఎంట్రీ ఫీజయితే దీనికంటే డబుల్ ఉంటుంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :