Saturday, 13 June 2026 07:07:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రాహుల్ ది మిడిమిడి జ్ఞానం...

-- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Date : 03 July 2024 05:41 AM

Telugu Rekha Media - జాతీయం / : కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎంఎఫ్ స్టాల్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు.. బొగ్గు, ఇతర ఖనిజాల గనుల సీఎస్సార్ R యాక్టివిటీలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. గనులున్న ప్రాంతాల ప్రజల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యత, స్వయం సహాయక బృందాలకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ ఆధ్వర్యంలో రూ.92వేల కోట్లకు పైగా నిధులున్నాయి. ఇందులో రూ.50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సహాయక బృందాల మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇందులో భాగంగా.. డీఎంఎఫ్ నిధుల ద్వారా.. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపును కల్పించడం, రానున్న రోజుల్లో వీరికి ఆదాయ వనరులను సమకూర్చే లక్ష్యంలో భాగంగా.. ఇవాళ డీఎంఎఫ్ స్టాల్ ప్రారంభించుకున్నాం. దశలవారిగా వీరికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాం.ఇప్పటికే ఢిల్లీ హాట్ లో శాశ్వత ప్రాతిపదికన ఓ స్టాల్ ఏర్పాటు చేశాం. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యంమని అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ... రాహుల్ గాంధీది మిడిమిడి జ్ఞానం. హిందువులపై విద్వేషపూరితంగా మాట్లాడుతూ.. మరోవైపు ఉగ్రవాద సంస్థలు, సన్నిహితులతో ఆయన దోస్తీ చేస్తున్నారు.హిందువులను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం, సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :