Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు : తోటపల్లి గూడూరు మండలం నక్కావారిపాళెంలో రథోత్సవం సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ అమృత లింగేశ్వర స్వామిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా సోమిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మాచర్లవారిపాళెం టీడీపీ నేత పొన్నలూరు శివకోటారెడ్డి ఆధ్వర్యంలో 1200 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అయన ఆకాంక్షించారు.
Reporter
Telugu Rekha Media