Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : విద్యతోపాటు బాలికలు యుక్త వయస్సులో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ చట్టాలపై అవగాహన వెంపొందించుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె. శ్రీదేవి అన్నారు. గురువారం జగన్నాధపురం గ్రామంలో మిషన్ శక్తి 100 రోజుల అవగాన కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగామన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి అనంతరం బాలికలకు బాల్య వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని అది చట్టరీత్యా నేరం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉన్నత విద్యను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే దేశాభివృద్ధిలో బాలికలు తమ వంతు పాత్ర పోషిస్తారని కోరారు. 18 సంవత్సరాలల లోపు బాలికలు వివాహం చేసుకోవడం ద్వారా కలిగే నష్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వ్యక్తిగతంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్స్ ఎ. తులసీరాణి, కె.గీత, టి.రామలక్ష్మి, వి. అంజికుమారి, ఎం.శాంతకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media